Thursday, 24 November 2022

వలస పక్షి జీవితం




మంచి ఉద్యోగం, మంచి జీతం, మంచి జీవితం అనుకుంటూ ఎన్నో కళలు కానీ కష్టపడి పరాయి దేశాలు వచ్చి స్థిరపడ్డాం. ఇక్కడికి వచ్చాక అర్ధం అవుతుంది మాతృభూమి విలువ. ఆత్మీయంగా  మనసారా పలకరించడానికి ఒక చుట్టం గని, బంధువు కానీ, స్నేహితుడు కానీ ఉండడు. రోజూ అదే ఉదోగం గోల. ఇక్కడ పరిచయం అయిన మనవాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ లోకంలో ఉంటూ మనల్ని వేరు చేసేవాళ్ళే తప్ప మనస్ఫూర్తిగా స్నేహ హస్తం చూపించే వాళ్ళు చాల అరుదు (అది నా కర్మ అనుకుంట). 


ఇవ్వన్ని చుసిన తర్వాత నా చిన్నప్పటి నిష్కల్మషమైన స్నేహం, ఆ స్నేహితులు గుర్తు  వచ్చారు.  మాతృభూమి అంటే ఏంటో అర్ధం తెలిసింది మరియు దాని విలువ అర్ధమయింది. కానీ ఎం చేస్తాం, ఏదయినా దూరం అయినప్పుడే దాని విలువ తెలుస్తుంది అంటారు.


ఈ బ్లాగ్ నేను తప్ప ఇంకా ఎవరు చదవరు అనుకుంటున్నా. ఒకవేళ ఎవరైనా చదివి మీరు కూడా నాలా కొంచెం లోన్లీ గా ఫీల్ అవుతుంటే, ఒక మిత్రుడు మీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అని గుర్తుంచుకోండి. ఆ మిత్రుడుని మీరు సంపాదించుకోవటానికి మీరు చేయవలిశింది కేవలం ఈ బ్లాగ్ మీద కామెంట్ చెయ్యటం మాత్రమే. 

No comments:

Post a Comment